బేయర్ ఫార్మ్ రైజ్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి
నిపుణుల వ్యవసాయ సలహాల కోసం!

పలు ప్రాంతాల్లో రైతు లు పరాగ సంపర్కం కోసం తేనెటీగలను పెంచుతున్నారు. ఈ సాధారణం గ రైతులు తేనెటీగలు పెంచడం వలన వాణిజ్య పంటలలో ప్రధానం గ ఫలదీకరణం మరియు ప్రధాన పరాగ సంపర్కా లకు ఉపయోగ పడతాయి . కానీ ఈ అడవి తేనెటీగల జాతులు లను కూడా సంరక్షించడం చాల ముఖ్యం . తేనెటీగలు పురుగుమందుల ప్రభావానికి గురికాకుండా సంరక్షించడం కొరకు జాగ్రత్త వహించాలి. మనం నేడు తీసుకునే ఆహార పదార్ధాలు మొక్కల నుంచి తయారు చేయబడతాయి మరియు సుమారు 70% పంటల్లో పరాగసంపర్కాలు ద్వారా మంచి దిగుబడివచ్చే అవకాశం ఉంది . కొన్ని పంటలు గాలి ద్వారా పరాగసంపర్కం చేయబడతాయి, అయితే పరాగసంపర్కాలు ఉన్నట్లయితే పూత మరియు కాయలు పళ్ళు సమృద్ధి గ వచ్చే అవకాశం ఉంది


















తేనెటీగల పెంపకం అనేది దిగుబడిని పెంచడం తోపాటుగా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉంటుంది. తేనే తుట్టెలు చాలావరకు పుష్పించే ప్రాంతాలలో ,తోటల కు దగ్గరగా బహిరంగ ప్రాంతంలో ఉండాలి. ఇక్కడ మకరందం మరియు పుప్పొడి ఎల్లప్పుడూ దొరికే అవకాశం ఉంటుంది . నాణ్యమైన తేనెటీగల ను ఎంపిక చేయడం, కాలనీలు, సీజనల్ మేనేజ్ మెంట్ వంటి విధానాలపై సలహా కోసం, దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన ్ కేంద్రాల నుండి సూచనలు తీసుకోండి. దేశంలో "స్వీట్ రివల్యూషన్" యొక్క లక్ష్యాన్ని సాధించడం కొరకు మిషన్ మోడ్ లో శాస్త్రీయ తేనెటీగల పెంపకం యొక్క సంపూర్ణ ప్రచారం మరియు అభివృద్ధి కొరకు 2 సంవత్సరాలపాటు "నేషనల్ బీకీపింగ్ & హనీ మిషన్ (NBHM)" పేరుతో ఒక కొత్త కేంద్ర రంగ పథకాన్ని కూడా భారత ప్రభుత్వం ఆమోదించింది.


ఈ కథనాన్ని చదివినందుకు ధన్యవాదాలు, మీరు వ్యాసాన్ని ఇష్టపడటానికి ♡ చిహ్నంపై క్లిక్ చేశారని మరియు ఇప్పుడు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కథనాన్ని భాగస్వామ్యం చేయాలని మేము ఆశిస్తున్నాము!